TDP Donations: తొలిరోజు 22.28 కోట్ల విరాళాలు
ABN, Publish Date - May 28 , 2025 | 05:47 AM
కడప మహానాడులో టీడీపీకి రూ.22.53 కోట్లు విరాళంగా వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇవ్వగా, మరో పలువురు ప్రముఖులు విరాళాలతో మద్దతు తెలిపారు.
కడప, మే 27(ఆంధ్రజ్యోతి): కడప మహానాడులో తెలుగుదేశం పార్టీకి సోమవారం రూ.22.28 కోట్లు విరాళంగా వచ్చాయని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను మహానాడు వేదికపై చంద్రబాబు చదివి వినిపించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.5కోట్లు, పి.నారాయణ రూ.కోటి, టీజీ భరత్ రూ.కోటి, సానా సతీశ్ రూ.1.16కోట్లు, ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాజగోపాల్ రూ.50లక్షలు, లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ర్టీస్ రూ.50లక్షలు, దామచర్ల జనార్దన్ 25లక్షలు, వేమన సతీశ్ 25లక్షలు, రవీంద్ర 25లక్షలు ఇచ్చారన్నారు. మొత్తం రూ.22.53కోట్లు పార్టీకి విరాళంగా వచ్చాయన్నారు. విరాళాలు ఇవ్వాలనుకునేవారు ‘తెలుగుదేశం పార్టీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, జూబ్లీహిల్స్ బ్రాంచి, అకౌంట్ నంబరు 18090200001238’’కు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు.
Updated Date - May 28 , 2025 | 05:51 AM