ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP MPs: ఢిల్లీలో టీడీపీ కార్యాలయానికి స్థలం ఇవ్వండి

ABN, Publish Date - Jul 23 , 2025 | 05:11 AM

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటయించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

  • కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు టీడీపీ ఎంపీల బృందం వినతి

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటయించాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. దీన్‌ దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం పక్కనే టీడీపీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఖట్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 6 కీలక పట్టణ మౌలిక సదుపాయాల (యూడీపీ) ప్రతిపాదనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.39,362 కోట్ల పెట్టుబడితో నిర్మించే విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించాలని టీడీపీ ఎంపీల బృందం కోరింది. మెట్రో రైల్‌ పాలసీ 2017 కింద మెట్రో రైలు ప్రాజెక్టులకు 100ు కేంద్రం సహకారం అందించాలని విన్నవించింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టులు పట్టణ రవాణా, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి సహకరిస్తాయని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఎన్‌హెచ్‌-16పై విశాఖపట్నంలో (20 కి.మీ.), విజయవాడలో (4.7 కి.మీ.) ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌, మెట్రో కారిడార్ల నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. ఎన్‌హెచ్‌ఏఐతో ఉమ్మడిగా డీపీఆర్‌ తయారీ, వ్యయ భరింపులపై చర్చలు జరిపేందుకు మంత్రిత్వ శాఖ సహకరించాలన్నారు. పీఎంఏవై అర్బన్‌ 2.0ని రాష్ట్రప్రభుత్వం చురుకుగా అమలు చేస్తోందని, ఇప్పటికే డీపీఆర్‌లు సమర్పించగా, 40 వేలకు పైగా గృహాలు మంజూరు అయినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖట్టర్‌తో భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో పాటు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ దగ్గుమళ్ల ప్రసాదరావు నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 05:11 AM