జగన్.. మళ్లీ అధికారంపై భ్రమలొద్దు: ఎంపీ కలిశెట్టి
ABN, Publish Date - Feb 15 , 2025 | 05:22 AM
సీఎంగా గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సీఎంగా గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నేడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం విమర్శించారు. రేపోమాపో అధికారంలోకి వస్తామనే భ్రమలు పెట్టుకోవద్దని జగన్‌కు హితవు పలికారు.
ఏపీలో జౌళి రంగానికి సహకారం అందించండి
జౌళి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉంటుందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అవసరమైన అనుమతులు వేగంగా అందిస్తుందని కేంద్ర జౌళి పరిశ్రమల మంత్రి గిరిరాజ్‌సింగ్‌తో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన భారత్ టెక్స్ 2025 ఎగ్జిబిషన్‌కు హాజరైన కేంద్ర మంత్రితో కలిసి ఏపీ స్టాల్‌ను కలిశెట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ జౌళి, చేనేత శాఖ కమిషనర్ రేఖారాణి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Feb 15 , 2025 | 05:23 AM