ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP MLAs : రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలం

ABN, Publish Date - Mar 18 , 2025 | 05:40 AM

అపారమైన రాజకీయ అనుభవం, ముందుచూపుతో వ్యవహరించే సీఎం చంద్రబాబు విజన్‌ అమలుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.

  • ఆనాడు విజన్‌-2020ను వెటకారం చేశారు

  • అదే నేటి హైదరాబాద్‌ అభివృద్ధికి కారణం

  • ‘విజన్‌-2047’తో ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ’ ఏపీ

  • పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యేలు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అపారమైన రాజకీయ అనుభవం, ముందుచూపుతో వ్యవహరించే సీఎం చంద్రబాబు విజన్‌ అమలుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్‌-2047’పై సోమవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ‘చంద్రబాబు ఆనాడు విజన్‌-2020 గురించి చెబితే అందరూ వెటకారం చేశారు. కంప్యూటర్‌లో అన్నం పెడతారా? అంటూ ఎద్దేవా చేసిన వాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌లోని కొండలు, గుట్టల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవు. అలాంటి ప్రాంతం సైబరాబాద్‌గా అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి హైదరాబాదు.. సైబరాబాద్‌గా రూపాంతరం చెందుతుందని, దేశంలోనే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదే నేడు నిజమైంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రూపొందించిన విజన్‌-2047కు ప్రజలందరూ సహకరిస్తే.. ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ’ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందని, 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలనే లక్ష్యం తప్పనిసరిగా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుపై నమ్మకమే కారణం: విష్ణుకుమార్‌రాజు

బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ‘చంద్రబాబు విజన్‌-2020లో పేర్కొన్న ప్రతి అంశం అమలైందని, ఒక విజనరీ నాయకుడు అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుందనేది దానికి ఇదే నిదర్శనం’ అన్నారు. కానీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. విజన్‌-2047పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, ఇది అమలు కావాలంటే ఆయనే అధికారంలో ఉండాలని పేర్కొన్నారు.


అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా..

10 సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ అమలుతో ఏపీ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు అన్నారు. విజన్‌ డాక్యుమెంట్‌పై పాఠశాల లు, కాలేజీల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ‘ఆశతో ఉన్న వారికి అధికారమిస్తే జగన్‌ లాగా దోచుకుంటారు. ఆశయంతో ఉన్న వారికి అధికారమిస్తే చంద్రబాబులా అభివృద్ధికి బాటలు వేస్తారు’ అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధికి కొత్త దారులు సృష్టిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పీ4 విధానంలో ప్రతి జిల్లాలో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నెలకొల్పాలని కోరారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గతంలో విజన్‌-2020ని రూపొందించినప్పుడు వెటకారంగా మాట్లాడారని, అప్పట్లో హైదరాబాదులో రూ.2 లక్షలు పలికిన ఎకరం భూమి ఇప్పుడు రూ.50 కోట్లు.. 100 కోట్లు కూడా పలుకుతోందని చెప్పారు. ఈ మార్పునకు చంద్రబాబు విజనే కారణమని చెప్పారు.

గాడి తప్పిన వ్యవస్థ పట్టాలపైకి..

ఎమ్మెల్యే గోండు శంకర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన విజన్‌-2047 ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ‘నాటి విజన్‌-2020తో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. నేటి విజన్‌-2047తో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడి తప్పిన వ్యవస్థలను మళ్లీ పట్టాల మీదకు తెచ్చి ముందుకు సాగుతున్నాం.’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:40 AM