ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anganwadi: అంగన్వాడీలు చంద్రబాబు మానసపుత్రికలు

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:42 AM

అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపును టీడీపీ అంగన్వాడీ సంఘాల నాయకురాలు ఆచంట సునీత హర్షంగా అభినందించారు. సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం, జీతాల పెంపు వంటి చర్యలతో అంగన్వాడీలను ఆదుకుంటోందని ఆమె అన్నారు.

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపుపై టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చంద్రన్న మానసపుత్రికలని ఆమె పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సునీత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అంగన్వాడీల సంక్షేమం, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైసీపీ పాలనలోలా అంగన్వాడీలకు, రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి కల్పించబోము. కర్ణాటక, గుజరాత్‌ తర్వాత వారికి గ్రాట్యుటీ అమలు చేసిన మూడో రాష్ట్రంగా ఏపీ ఉంది. అంగన్వాడీలకు రూ.4,200 ఉన్న జీతాన్ని రూ.10,500 చేసిన ఘనత చంద్రబాబుది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట మేరకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం పెంచింది’ అని సునీత తెలిపారు

Updated Date - Apr 22 , 2025 | 04:42 AM