Neelayapalem: తల్లికి వందనంతో ప్రతి ఇంటా ఆనందం
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:57 AM
కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపింది అని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ అన్నారు.
వైసీపీ ఫీజు బకాయిలు 3,400 కోట్లూ చెల్లిస్తున్నాం -నీలాయపాలెం
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపింది’ అని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది. మంత్రి లోకేశ్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు చదువు మానేశారు. ఇది విద్యారంగంపై వైసీపీకి ఉన్న నిబద్ధత. రాష్ట్రంలో 88 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 42 లక్షల మందికి మాత్రమే ‘అమ్మ ఒడి’ అందించారు. కూటమి ప్రభుత్వం మాత్రం 67లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన 3,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలనూ తీరుస్తున్నాం’ అని నీలాయపాలెం వివరించారు.
Updated Date - Jun 17 , 2025 | 04:58 AM