ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లికి వందనం.. వైసీపీకి మరణ శాసనం: పెమ్మసాని

ABN, Publish Date - Jun 15 , 2025 | 06:37 AM

సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కు సంస్కృతి జగన్‌ది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు. గుంటూరులో శనివారం జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌...

గుంటూరు, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కు సంస్కృతి జగన్‌ది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు. గుంటూరులో శనివారం జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ వడ్రాణం హరిబాబు నాయుడు సన్మాన సభకు హాజరైన ఆయన జగన్‌ వైఖరిని తప్పుపట్టారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు ఎంత వరకైనా వెళతారు. తల్లికి వందనం పథకం అమలు వైసీపీకి మరణశాసనం లాంటిది. దేశంలోనే అత్యధికంగా నెలకు రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తోన్న రాష్ట్రం మనది మాత్రమే’ అని అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ, ‘గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సహకార కేంద్ర బ్యాంకుల్లో వైసీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతిన్నారు. డీసీసీబీల్లో అవినీతిని వెలికి తీస్తాం. అక్రమార్కులను వదిలిపెట్టేదిలేదు’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jun 15 , 2025 | 06:39 AM