ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Finance Companies Fraud: ఫైనాన్స్‌ కంపెనీలకు వందనం

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:35 AM

చిన్నారుల చదువుల కోసం తల్లుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న ‘తల్లికి వందనం’ సొమ్ము ‘ఆటోమేటిక్‌’గా ఫైనాన్స్‌ కంపెనీలకు వెళ్లిపోతోంది.

  • బ్యాంకు ఖాతాల్లోంచి ‘ఆటోమేటిక్‌’గా పోతున్న నగదు

  • బజాజ్‌ ఫైనాన్స్‌పై పోలీసులకు లబ్ధిదారుల ఫిర్యాదు

గుంతకల్లు టౌన్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): చిన్నారుల చదువుల కోసం తల్లుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న ‘తల్లికి వందనం’ సొమ్ము ‘ఆటోమేటిక్‌’గా ఫైనాన్స్‌ కంపెనీలకు వెళ్లిపోతోంది. దీంతో అనంతపురం జిల్లా గుంతకల్లులో మంగళవారం పలువురు మహిళలు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి గతంలో టీవీ, ఫ్రిడ్జ్‌ తదితర వస్తువులు కొనుగోలు చేశామని, వాటికి నెలనెలా ఈఎంఐలు చెల్లించినా.. ఇంకా డబ్బులు కట్‌ చేస్తున్నారని దుర్గ, ఆదిలక్ష్మి, ముంతాజ్‌ బేగం తదితరులు చెప్పారు. ఓ మహిళ టీవీ కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టకపోవడంతో రెండేళ్ల కిందటే ఆ టీవీని కంపెనీ ప్రతినిధులు తీసుకుపోయారని.. అయినా డబ్బులు కట్‌ చేస్తున్నారని చెప్పారు. చదువు రాని వారికి వస్తువులు ఇచ్చి, రుణాల పేరుతో ఏళ్ల తరబడి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. బాకీ తీరినా.. రుణాన్ని క్లోజ్‌ చేయడం లేదన్నారు. తల్లికి వందనం డబ్బులను తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.

Updated Date - Jun 18 , 2025 | 06:36 AM