ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ చెవి దిద్దులు తీసుకుని న్యాయం చేయండి!

ABN, Publish Date - May 20 , 2025 | 12:51 AM

ఈ చెవి దిద్దులు తీసుకుని అయినా నాకు న్యాయం చేయండి అంటూ గూడూరు మండలం తరకటూరుకు చెందిన ఓ మహిళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారుల టేబుల్‌పై బంగారు వస్తువులు పెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా.. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, గ్రామపెద్దల తీరుతో విసిగిపోయానని, వారడుగుతున్నంత డబ్బు నా వద్ద లేదని, వీటిని వారికి ఇప్పించి ఆక్రమణలోని నా స్థలం ఇప్పించాలని వేడుకుంది.

- జిల్లా అధికారులకు తరకటూరు మహిళ విజ్ఞప్తి

- నా తల్లిదండ్రుల స్థలం ఆక్రమించి ఇల్లు కట్టారు

- కోర్టుకెళ్తే నాకు అనుకూలంగా తీర్చు వచ్చింది

- అమలు చేయమని రెవెన్యూ, పోలీస్‌ అధికారులను కోరితే..

- గ్రామపెద్దలతో కలిసి డబ్బులు అడుగుతున్నారు

- నా వద్ద నగదు లేదు.. ఇవి వారికిచ్చి న్యాయం చేయండి

- ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద మహిళ ఆవేదన

ఈ చెవి దిద్దులు తీసుకుని అయినా నాకు న్యాయం చేయండి అంటూ గూడూరు మండలం తరకటూరుకు చెందిన ఓ మహిళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారుల టేబుల్‌పై బంగారు వస్తువులు పెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా.. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, గ్రామపెద్దల తీరుతో విసిగిపోయానని, వారడుగుతున్నంత డబ్బు నా వద్ద లేదని, వీటిని వారికి ఇప్పించి ఆక్రమణలోని నా స్థలం ఇప్పించాలని వేడుకుంది.

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:

గూడూరు మండలం తరకటూరుకు చెందిన భార్గవి అనే మహిళ తల్లిదండ్రులకు గ్రామం ఉన్న నాలుగు సెంట్ల ఇళ్ల స్థలాన్ని కొందరు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారు. దీనిపై భార్గవి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టులో తీర్పు భార్గవికి అనుకూలంగా వచ్చింది. అయితే ఆక్రమణదారులు స్థానిక పెద్దల సహకారంతో ఇల్లు ఖాళీ చేయడంలేదు. దీనిపై పోలీస్‌, రెవెన్యూ అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని భార్గవి కోరారు. అయితే స్థానిక పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి కోర్టు తీర్పును అమలు చేయనీయడంలేదు. గట్టిగా అడిగితే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన భార్గవి అధికారులను కలసి వినతిపత్రం అందించింది. ‘‘న్యాయం చేయమంటే అధికారులు, గ్రామపెద్దలు డబ్బులు అడుగుతున్నారు.. తన వద్ద డబ్బు లేదు.. ఈ చెవిదిద్దులే ఉన్నాయి. వీటిని వారికి ఇచ్చి తన తల్లిదండ్రుల ఇంటిస్థలాన్ని తనకు అప్పగించేలా చూడాలి’’ అని కోరుతూ చెవికున్న దిద్దులను తీసి అధికారుల ఎదుట టేబుల్‌పై పెట్టింది. ఈ పరిణామంతో అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని గతంలోనే గూడూరు మండల అధికారులకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పామని, మళ్లీ చెబుతామని మచిలీపట్నం ఆర్టీవో సర్థిచెప్పారు.

మానవ హక్కుల సంఘం ముసుగులో మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు

మచిలీపట్నంలో మానవ హక్కుల సంఘం చైర్మన్‌నని చెప్పుకుంటున్న రజనీ తనను మోసం చేయడమే కాకుండా, కేసు పెట్టిస్తానని బెదిరిస్తోందని, తనకు న్యాయం చేయాలని పెడనకు చెందిన బట్టా పావని అనే మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం అర్జీ అందజేశారు. తన భర్త శివనాగసుబ్బారావు వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయమని రజనీ వద్దకు వెళ్లానని ఆమె తెలిపింది. తనకు విడాకులు ఇప్పిస్తానని, ఖర్చుల కింద లక్ష రూపాయలు ఇవ్వమని కోరిందని ఫిర్యాదులో పేర్కొంది. తన వద్ద అంత నగదు లేదని, తన కాపురం చక్కదిద్దమని కోరితే తనను, తన భర్తను ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడకుండా విడివిడిగా మాట్లాడిన రజనీ ఆ తర్వాత తన భర్త తరపునే మాట్లాడుతోందని తెలిపింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని, తన కాపురం చెడగొట్టే ప్రయత్నం రజనీ చేస్తోందని ఆమె వాపోయింది. తనను రాష్ట్రపతి ఈ పోస్టులో నియమించారని, నీపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిస్తానని రజనీ బెదిరించిందని పావని వివరించింది. ఈ అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ పెడన పోలీసులను ఆదేశించారు.

పొలం వద్దకు వెళ్లనివ్వడంలేదు.. న్యాయం చేయండి

తన పొలం వద్దకు వెళ్లనీయకుండా కొందరు తనను అడ్డుకుంటున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌కు అర్జీ అందజేసింది. తన పొలం చుట్టు పక్కల వారు తన పొలం వద్దకు వెళ్లడానికి దారిలేదని చెబుతూ తనను అడ్డగిస్తున్నారని, పొలం సాగు చేసుకోనివ్వబోమని బెదిరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరింది.

Updated Date - May 20 , 2025 | 12:51 AM