టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - May 16 , 2025 | 11:50 PM
మెరుగైన జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారి యా సూచించారు.
కలెక్టర్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, మే 16 (ఆంధ్రజ్యోతి): మెరుగైన జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారి యా సూచించారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఒంగోలులోని డాన్ బాస్కో, ఐటీఐ కేంద్రా ల్లో మహిళలకు ఇస్తున్న టైలరింగ్ శిక్షణను శు క్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కలెక్టర్ మా ట్లాడారు. వారి కుటుంబ నేపథ్యాన్ని అడిగి తె లుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, స్వశక్తితో ఎదగాలనేది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు చె ప్పారు. మూడు నెలల పాటు జరిగే ఈ శిక్ష ణలో ప్రస్తుతం 4,233 మంది శిక్షణ తీసుకుం టున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, అధికా రులు పాల్గొన్నారు.
Updated Date - May 16 , 2025 | 11:50 PM