Surrogate Pregnancy Fraud: సరోగసీ ముసుగులో పైసా వసూల్
ABN, Publish Date - Aug 03 , 2025 | 05:01 AM
సరోగసీ ముసుగులో రూ.లక్షలు వసూలు చేసి, పిల్లలు లేని దంపతులను మోసగించిన ‘సృష్టి’ కేంద్రం వ్యవహారంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది.
యూఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫెర్టిలిటీ కేంద్రంపై ఫిర్యాదులు
వైజాగ్‌లోని ‘సృష్టి’ కేంద్రానికి రిఫర్ చేశారని ఆరోపణ
పూర్తిస్థాయి విచారణకు కమిటీ నియామకం
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సరోగసీ ముసుగులో రూ.లక్షలు వసూలు చేసి, పిల్లలు లేని దంపతులను మోసగించిన ‘సృష్టి’ కేంద్రం వ్యవహారంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని యూఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు సరోగసీ పేరుతో తమవద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తమను రిఫర్ చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఈ కేంద్రానికి శనివారం నోటీసు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి పూర్తిస్థాయి విచారణకు వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులతో ఒక కమిటీని నియమించారు. సరోగసీ ప్రక్రియకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందో, లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. అధికారులు విచారణ నిమిత్తం వెళ్లిన సమయంలో సరోగసీ కేంద్రానికి తాళం వేసి ఉంది.
Updated Date - Aug 03 , 2025 | 05:02 AM