Andhra Pradesh CID: సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం విచారణ జూలై 23కి వాయిదా
ABN, Publish Date - May 22 , 2025 | 06:15 AM
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు మంజూరు అయిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేసింది. విచారణ సీనియర్ న్యాయవాది లేమితో జూలై 23 వరకు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, మే 21(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అగ్నిమాపక శాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును ఈ ఏడాది మార్చి 5న ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ బుధవారం జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా,జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడంతో విచారణను బెంచ్ జూలై 23కి వాయిదా వేసింది.
Updated Date - May 22 , 2025 | 06:15 AM