ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: వాదనలు ఇవాళ వినిపించాల్సిందే

ABN, Publish Date - Jul 31 , 2025 | 04:55 AM

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు వినిపించాల్సిందేనని.. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆయన తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది.

  • లేదంటే వేరే మార్గాలు చూసుకోండి

  • సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ తరఫు న్యాయవాదులకు సుప్రీం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు వినిపించాల్సిందేనని.. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆయన తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ)ను ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును అప్పటి జైళ్ల శాఖ డీజీ సంజయ్‌.. సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించారు. పనులు జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చి రూ.1.19 కోట్లు చెల్లించారు. సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే జరిపారు. ఆ సంస్థ కు బిల్లుల పేరిట దోచిపెట్టారు. ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల నష్టం కలిగించారని రాష్ట్ర విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేయడం.. ప్రధాన నిందితుడిగా సంజయ్‌ పేరును చేర్చడం, ఆ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మార్చి 5న రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సంజయ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అందుబాటులో లేరని జూనియర్‌ న్యాయవాది తెలిపారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని రాష్ట్రప్రభుత్వం తరఫు పు న్యాయవాది ఏఎస్‌ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణలో తీవ్ర జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారమే(నేడు) వాదనలు వినిపించాలని.. లేనిపక్షంలో వేరే మార్గాలు చూసుకోవాలని సంజయ్‌ తరఫు న్యాయవాదులను ధర్మాసనం హెచ్చరించింది.

Updated Date - Jul 31 , 2025 | 04:56 AM