ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మామిడి రైతుకు బాసట

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:34 AM

గంగాధరనెల్లూరు మండలంలోని 100 గొల్లపల్లె వద్ద వున్న జైన్‌ఫ్యాక్టరీకి మామిడి పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్న రైతులకు ప్రభుత్వ విప్‌ థామస్‌ బాసటగా నిలిచారు.సొంత ఖర్చులతో ఫ్యాక్టరీ వద్ద వేచివున్న రైతులతో పాటు మామిడి కాయలు తోలుకొచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్లకు మధ్యాహ్నంపూట బుధవారం నుంచి భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

రైతులకు భోజనం ప్యాకెట్లను అందజేస్తున్న థామస్‌

గంగాధరనెల్లూరు మండలంలోని 100 గొల్లపల్లె వద్ద వున్న జైన్‌ఫ్యాక్టరీకి మామిడి పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్న రైతులకు ప్రభుత్వ విప్‌ థామస్‌ బాసటగా నిలిచారు.సొంత ఖర్చులతో ఫ్యాక్టరీ వద్ద వేచివున్న రైతులతో పాటు మామిడి కాయలు తోలుకొచ్చిన ట్రాక్టర్‌ డ్రైవర్లకు మధ్యాహ్నంపూట బుధవారం నుంచి భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.రోడ్డుపక్కన మామిడి కాయలలోడ్‌తో రెండుకిలోమీటర్ల దాకా బారులు తీరిన ట్రాక్టర్ల వద్దకు స్వయంగా వెళ్ళి అక్కడ వేచివున్న సుమారు 300 మంది రైతులకు, డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లతో పాటు నీళ్ల బాటిళ్లను థామస్‌ అందజేశారు. మామిడికాయల సీజన్‌ పూర్తయ్యేవరకు మామిడికాయల లోడుతో వచ్చే రైతులకు, డ్రైవర్లకు భోజన సౌకర్యం కల్పించాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటులేకుండా చూడాలన్నారు

-గంగాధరనెల్లూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 19 , 2025 | 01:34 AM