మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
ABN, Publish Date - Jul 31 , 2025 | 04:20 AM
మానవ అక్రమ రవాణా వ్యక్తుల స్వేచ్ఛ, హక్కులు, మానవతా విలువలను హరించే ఘోరమైన నేరమని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు.
విజయవాడ సిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా వ్యక్తుల స్వేచ్ఛ, హక్కులు, మానవతా విలువలను హరించే ఘోరమైన నేరమని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఏపీ పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మానవ అక్రమ రవాణా ఓ వ్యవస్థీకృత నేరం-దోపిడీ’ అనే పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. డీపీజీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ ఎన్.మధుసూదనరెడ్డి, ఉమెన్, చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏపీఎస్పీ బి.రాజకుమారి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ ఎన్.దేవీరావు పాల్గొన్నారు. మానవహక్కుల పరిరక్షణ కోసం ఉమెన్, చైల్డ్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు. మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసం 112 టోల్ ఫ్రీ నంబర్, శక్తి యాప్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 04:21 AM