ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Loan Scam: స్త్రీనిధి రుణాల అక్రమాలపై చర్యలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:07 AM

గత ఐదేళ్లలో స్త్రీ నిధి రుణాలు దారి మళ్లాయని, వాటిపై విచారణ చేపట్టాలని సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. శుక్రవారం స్త్రీనిధిపై విజయవాడ సెర్ప్‌ కార్యాలయంలో ఆయన డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లుతో సమీక్ష నిర్వహించారు.

  • అవకతవకలకు పాల్పడిన వారిపై కేసులు

  • 2025-26లో 5,700 కోట్ల రుణాలే లక్ష్యం: మంత్రి కొండపల్లి

అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో స్త్రీ నిధి రుణాలు దారి మళ్లాయని, వాటిపై విచారణ చేపట్టాలని సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. శుక్రవారం స్త్రీనిధిపై విజయవాడ సెర్ప్‌ కార్యాలయంలో ఆయన డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లుతో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో కొందరు ప్రాజెక్టు సిబ్బంది స్త్రీనిధి రుణాలను దుర్వినియోగం చేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రుణాలను అక్రమ మార్గంలో మళ్లించినట్లు గుర్తించామని, ఇలాంటి చర్యలు పేద మహిళల అభివృద్ధికి అడ్డంకిగా మారతాయని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్త్రీనిధి ఎండీని మంత్రి ఆదేశించారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై జిల్లా/మండల స్థాయిలో కేసులు నమోదు చేయాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు. 2025-26 సంవత్సరానికి స్త్రీనిధి కింద రూ.5,700 కోట్ల రుణాలు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో అర్హులైన మహిళలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని స్పష్టం చేశారు. స్త్రీనిధి కార్యకలాపాల డిజిటలైజేషన్‌లో భాగంగా ఇటీవల ప్రారంభించిన స్త్రీనిధి రికవరీ యాప్‌ వినియోగంపై స్వయం సహాయక బృందాల సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ఈ యాప్‌ ద్వారా సభ్యులు తమ రుణ చెల్లింపును సులభంగా ట్రాక్‌ చేయవచ్చన్నారు. సీఐఎఫ్‌ రుణాల మంజూరు, రికవరీ పర్యవేక్షణను ఇప్పటి నుంచి స్త్రీనిధి ద్వారా చేయాలని పేర్కొన్నారు. సెర్ప్‌ సీఈఓ వాకాటి కరుణ మాట్లాడుతూ 48 గంటల్లో స్త్రీనిధి రుణాలు అందించడం, సభ్యుల అవసరాలను గుర్తించడం ద్వారా ఈ రుణాలను ప్రతి గ్రామ సంఘం వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. స్త్రీనిధిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు స్త్రీనిధి పనితీరుపై సమీక్షలు నిర్వహించాలని జిల్లా పీడీలకు సూచించారు.

Updated Date - Jun 14 , 2025 | 04:10 AM