ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPM Leader Srinivas Rao: బలవంతపు భూసేకరణ ఆపండి

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:51 AM

ఇండోసోల్‌ కంపెనీ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో తలపెట్టిన బలవంతపు భూసేకరణను తక్షణం నిలిపివేయాలని, రైతులను కాపాడాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

  • కరేడు రైతులను కాపాడండి: సీపీఎం శ్రీనివాసరావు

కందుకూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఇండోసోల్‌ కంపెనీ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో తలపెట్టిన బలవంతపు భూసేకరణను తక్షణం నిలిపివేయాలని, రైతులను కాపాడాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కేవలం ఓ కంపెనీ కోసం 20వేల మంది జీవితాలను పణంగా పెట్టడం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిదికాదని ఆయన అన్నారు. కందుకూరులో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ.. రైతుల భూములను లాగేసుకోటానికి ప్రయత్నిస్తుండటం దారుణమని విమర్శించారు. కరేడులో కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపై నిరసిస్తుంటే, ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవటం దేనికి సంకేతమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అభ్యంతరాలు లేని, పంటలకు యోగ్యంకాని భూములు, ప్రభుత్వ భూములను ఇలాంటి సంస్థలకు కేటాయించాలేకానీ మూడు పంటలు పండే పచ్చని భూములను ఎందుకు ఇవ్వాలనుకుంటోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 06:53 AM