ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్కామ్‌లతో రాష్ట్రాన్ని వైసీపీ కొల్లగొట్టింది

ABN, Publish Date - May 25 , 2025 | 12:38 AM

తన ఐదేళ్ల పాలనలో వైసీపీ స్కామ్‌లతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని, తద్వారా రాష్ట్రం సు మారు 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్య నారాయణ అన్నారు.

మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ

ఆమదాలవలస, మే 24(ఆంధ్రజ్యోతి): తన ఐదేళ్ల పాలనలో వైసీపీ స్కామ్‌లతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిందని, తద్వారా రాష్ట్రం సు మారు 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్య నారాయణ అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో శివ్వాల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అరాచక అవినీతి పాలనను మరిచిపోయి నియోజకవర్గం ఆ పార్టీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ కూటమి ప్రభుత్వంపై, టీడీపీ నాయకులపై చౌకబారు ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆమదాలవలస నియోజక వర్గంలో 48 వేల సభ్యత్వాలతో ఉన్న తెలుగుదేశం పార్టీ సమావేశా లకు, ఇతర వ్యక్తులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, దీనిని వైసీపీ నాయకులు గ్రహించాలన్నారు. రాష్ట్ర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి బోర గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు మాట్లాడుతూ.. ఆమదాలవలస నియోజకవర్గం లో అభివృద్ధిపై చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు బీవీ రమణమూర్తి, తంగి గురయ్య, ఇంజరాపు విశ్వనాథం, మీసాల రామారావు, కందుల వెంకటరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోనెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

కక్ష సాధింపు అనడం సరికాదు

రణస్థలం, మే 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు పే ర్కొనడం సరికాదని డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవి నాష్‌, మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వ రరావు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భు వనేశ్వరరావు, కూటమి నేతలు సంపతిరావు నాగేశ్వర రావు, గాలి వెంకటరెడ్డి, కొత్తకోట అమ్మినాయుడు అ న్నారు. ఎచ్చెర్లలో వారు శనివారం విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీలో జరగని అభివృ ద్ధి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎ మ్మెల్యే సారఽథ్యంలో జరిగిందని చెప్పారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు పైడి ముఖలింగం, మెండ రాజా రావు, జీరు రామారావు, బోర శ్రీనివాసరావు, ఉంగటి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:38 AM