ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువకుడి బలవన్మరణం

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:57 PM

సూదికొండ కాలనీలో నివాసం ఉంటు న్న ఎస్‌.నూకరాజు(22) శనివారం ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు.

పలాస, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సూదికొండ కాలనీలో నివాసం ఉంటు న్న ఎస్‌.నూకరాజు(22) శనివారం ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. ఈయన తండ్రి నారాయణ జీడి కార్మికుడిగా పని చేస్తున్నాడు. గదిలో తండ్రి నిద్రిస్తుండగా మరో రూంలో నూకరాజు ఫ్యాన్‌ హుక్‌కు లుంగీ కట్టి ఉరి వేసుకున్నాడు. పొరుగున ఉన్న ఓ మహిళ మిక్సీ కోసం వీరింటికి రాగా ఉరిపోసుకుని ఉన్న నూకరాజు కనిపించ డంతో నిద్రి స్తున్న అతడి తండ్రిని లేపి విషయం చెప్పింది. వెంటనే అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీ కరించారు. కడుపు నొప్పితో బాధ పడుతూ మృతి చెంది ఉంటాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కాశీబుగ్గ సీఐ పి.సూర్య నారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొందూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): పొందూరు రైల్వేస్టేషన్‌లో శని వారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(40) మృతి చెందినట్టు జీఆర్పీ సిబ్బంది మధుసూదనరావు తెలిపారు. పట్టాలు దాటుతుండగా గుర్తుతెలి యని రైలు ఢీకొనడంతో మృతి చెంది ఉండవచ్చునన్నారు. వివరాల కోసం 9110305494 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని కోరారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

మృతుడిది విశాఖ సిటీ తాటిచెట్లపాలెం

లావేరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): అదపాక సమీపంలోని పంట పొలాల్లో శనివారం అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అద పాక సమీప పంట పొలాల్లో ఒకరి మృతదేహం ఉందని వీఆర్వో ఎన్‌.వెంకటరమణ పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించగా.. మృతుడిది విశాఖ సిటీ తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎన్‌.జగన్నాఽథం (37)గా గుర్తించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు హెచ్‌సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:57 PM