బీజేపీ బలోపేతానికి కృషి చేయండి
ABN, Publish Date - May 05 , 2025 | 11:42 PM
బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవా రం రణస్థలంలోని ఎన్‌ఈఆర్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ క్రియాశీలక కార్య కర్తల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ నడుకుదిటి రజిని ఎన్‌ఈఆర్ అధ్యక్షతన జరిగింది.
రణస్థలం, మే 5(ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవా రం రణస్థలంలోని ఎన్‌ఈఆర్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ క్రియాశీలక కార్య కర్తల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ నడుకుదిటి రజిని ఎన్‌ఈఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉం డాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సంపతరావు నాగేశ్వరరావు, నాలుగు మండలాలపార్టీ అధ్యక్షులు లుకలాపు అప్పలనాయుడు, మహంతి అనంత్, పైల విష్ణుమూర్తి, సనపల రామారా వు, జీరు రామారావు, పీవీ రత్నం, ఆకెళ్ల సూరిబాబు పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 11:42 PM