భర్త వేధింపులపై భార్య ఫిర్యాదు
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:11 AM
అల్లినగరం గ్రామానికి చెందిన చిన్ని భవానీ తన భర్త తాన్ని శ్రీను వేధిస్తున్నాడంటూ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఎచ్చెర్ల, జూన్ 2(ఆంధ్రజ్యోతి): అల్లినగరం గ్రామానికి చెందిన చిన్ని భవానీ తన భర్త తాన్ని శ్రీను వేధిస్తున్నాడంటూ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లినగరం గ్రామానికి చెందిన భవానీతో శ్రీకాకుళం రూరల్ మండలం తంగివానిపేట గ్రామాని చెందిన శ్రీనుతో కొన్నేళ్ల కిందట వివాహామైంది. వీరికి ఒక పాప ఉంది. అయితే శ్రీను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు.
Updated Date - Jun 03 , 2025 | 12:11 AM