ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలు ఎందుకు పంపిణీ చేయడం లేదు?: జేసీ

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:55 PM

: ‘చిన్నారులకు పాలు ఎందుకు అందజేయడం లేదని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఐసీడీఎస్‌ పీవోను ప్రశ్నించారు. కరవంజలో గల అంగన్‌వాడీ, రేషన్‌ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ జరగకపోవడంపై సంబంధిత పీవోను వివరణ అడిగారు.

ఎరువుల దుకాణం తనిఖీ చేస్తున్న జేసీ:

జలుమూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ‘చిన్నారులకు పాలు ఎందుకు అందజేయడం లేదని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఐసీడీఎస్‌ పీవోను ప్రశ్నించారు. కరవంజలో గల అంగన్‌వాడీ, రేషన్‌ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ జరగకపోవడంపై సంబంధిత పీవోను వివరణ అడిగారు. పీవో అనూరాధ మాట్లాడుతూ పాల ప్యాకెట్లను ప్రస్తుతం సారవకోట మండలంలో పంపిణీ చేస్తున్నామని, జలుమూరులో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తామని జేసీకి తెలిపారు. ఆదర్శ పాఠశాలలో భోజన పథకం వంటలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. చల్లవానిపేట కూడలిలో గల శ్రీలక్ష్మీ ట్రేడర్సు ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు అధిక ధరలకు విక్రయించినట్లు రుజువైతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఒక ఎకరాకు యూరియా ఏ మేరకు వేయాలని సంబంధిత వ్యవసాయ సహాయకులను అడిగారు. సరైన సమాధానం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసారు. గుంజుమెట్టవద్ద రోడ్డుకు ఇరువైపుల చెత్త ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేసారు. చెత్తను తక్షణమే తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో కె.అప్పలనాయుడు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, ఆర్‌.ఐ కిరణ్‌, ఎంఈవో బి.మాధవరావు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:55 PM