ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

cashew Industries: జీడి ఆధారిత పరిశ్రమలేవీ?

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:04 PM

cashew -Based Industries జిల్లాలో జీడిపంట విస్తారంగా సాగు అవుతున్నా.. జీడిపండ్ల ఆధారిత పరిశ్రమల స్థాపన మాత్రం కలగానే మిగులుతోంది. ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన జీడిపండు.. వృథా అవుతోంది. సాధారణంగా ఏ పండుకూ లేని ఘనత జీడికి ఉంది. ఎక్కడైనా పండును తిని గింజను పారబోస్తాం. కానీ జీడిలో మాత్రం గింజను భద్రం చేసి పండును పనికిరాదని పారబోస్తుంటాం.

  • ఆసక్తి చూపని వ్యాపారులు

  • పెట్టుబడి పెట్టేందుకు వెనుకంజ

  • పలాస, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీడిపంట విస్తారంగా సాగు అవుతున్నా.. జీడిపండ్ల ఆధారిత పరిశ్రమల స్థాపన మాత్రం కలగానే మిగులుతోంది. ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిన జీడిపండు.. వృథా అవుతోంది. సాధారణంగా ఏ పండుకూ లేని ఘనత జీడికి ఉంది. ఎక్కడైనా పండును తిని గింజను పారబోస్తాం. కానీ జీడిలో మాత్రం గింజను భద్రం చేసి పండును పనికిరాదని పారబోస్తుంటాం. జీడి పండును సక్రమంగా వినియోగిస్తే గింజకన్నా అధికంగా లాభాలు ఆర్జించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. అయితే అందుకు తగిన సాధనాలు, మార్కెటింగ్‌ లేకపోవడం, తినడానికి వగరుగా ఉండడంతో జీడిపండు కేవలం మట్టిలో కలిసి ఎరువుగా మారింది. ఈ పళ్లు ఎందుకూ పనికిరాకుండా తోటల్లో వృఽథాగా పడిపోతున్నాయి.

  • జీడిపండు రంగు ముచ్చటగా ఉన్నా, సువాసన మాత్రం ఘాటుగా ఉంటుంది. ఇందులో నిమ్మజాతుల కంటే అధికంగా సి విటమిన్‌ లభిస్తుంది. జీడి పళ్లను పిక్కనుంచి వేరు చేసిన తరువాత నీటిలో బాగా కడిగి ప్రాసెసింగ్‌కు వినియోగించాలి. స్టీల్‌, ప్లాస్టిక్‌ పాత్రల్లో మాత్రమే దీన్ని నిల్వ చేయాలి. ఈ పళ్లను సేకరించిన తరువాత 15-17 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే 15 రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది. దీని గుజ్జును అతి శీతల దశలో నిల్వ చేస్తే ఏడాది పొడవునా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

  • జీడిపండ్ల నుంచి గుజ్జు తీసి.. దాని ద్వారా రసం తీయాలి. పండు బట్టి 50శాతం వరకూ రసం ఇందులో వస్తుంది. ఇందులో ఘాటయిన పదార్థాన్ని వెలికితీయడానికి కిలోకు రెండు గ్రాముల సగ్గుబియ్యం పొడిని సరిపడా చల్లనీటిలో కరిగించి తరువాత వాటిని వేడిచేసి అందులో కలియబెట్టాలి. 3 గంటల తరువాత పైకి తేలిన రసాన్ని తీసుకొని జ్యూస్‌, స్క్వాష్‌, సిరప్‌ల తయారీకి వినియోగించవచ్చు.

  • ముందుకు రాని వ్యాపారులు:

  • జీడిపండు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన పరిస్థితి ఉన్నా వ్యాపారులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో 32 వేల హెక్టార్లులో జీడి పంట సాగవుతోంది. మొత్తం పండ్లను సేకరిస్తే 5 పరిశ్రమల వరకూ ముడిసరుకు సరిపోతుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రాలేకపోతున్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట అవగాహన కార్యక్రమం, ఆధారిత పరిశ్రమలను పరిచయం చేసినా సరైన గైడెన్స్‌ లేకపోవడంతో పరిశ్రమల ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. జీడి జ్యూస్‌తో పాటు సోడాలు కూడా చేయవచ్చని అధికారులు అవగాహన కల్పించారు. కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామికవాడలో జీడి పండ్ల ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్యాపారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ జరిగితే జీడి పంటకు పిక్కలతో పాటు పండ్లకు కూడా మంచి వ్యాపారం ఉంటుందనడంలో సందేహమే లేదు.

  • అవగాహన కల్పించాలి

    జీడి పళ్ల ఆధారిత పరిశ్రమలపై వ్యాపారులకు అవగాహన కల్పించాలి. పండు వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. పరిశ్రమలు పెట్టిన తరువాత మార్కెటింగ్‌ లేకపోతే ఇబ్బందులు పడేది వ్యాపారులే. ఔత్సాహిక వ్యాపారులకు కూడా ప్రోత్సహిస్తాం.

    - టంకాల రవిశంకర్‌గుప్తా, జీడి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పలాస

Updated Date - Apr 24 , 2025 | 11:04 PM