ట్రాఫిక్ బాధలు తప్పేదెప్పుడో?
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:53 PM
జిల్లాలో అత్యంత రద్దీ అయిన రహదారుల్లో ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డు ఒకటి. ఈ రహదారిలో ప్రతి రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రోడ్డు పూర్తయినా.. కల్వర్టుల వద్ద అదే పరిస్థితి
ఆమదాలవలస రోడ్డులో ప్రయాణికులకు తప్పని అవస్థలు
పట్టించుకోని యంత్రాంగం
ఆమదాలవలస, జూన్ 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత రద్దీ అయిన రహదారుల్లో ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డు ఒకటి. ఈ రహదారిలో ప్రతి రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డులో నిరంతర ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యపై వాహనచోద కులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలో హైవేకి సమీపాన కొత్తరోడ్డు దగ్గర ఉన్న కాలువ పై గల వంతెన వద్ద సోమవా రం ట్రాఫిక్ సమస్య నెలకొంది. శ్రీకాకుళం పట్టణం నుంచి ఆ మదాలవలస వరకు ఉన్న ఈ ప్రధాన రహదారిలో సుమారు ఆరు సంవత్సరాలుగా భారీ స్థాయిలో గుంతలు ఏర్పడి ఎన్నో రోడ్డు ప్రమాదాలు సం బంధించి పలువురు వాహనదా రులు ప్రాణాలు కూడా కోల్పోయారు. మరెంతోమంది గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికు మార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక దృష్టిసారించి రహదారి నిర్మాణాన్ని చాలావరకు పూర్తి చేయించారు. అయితే ఈ రహదారిలో కొన్ని కల్వర్టుల వద్ద వంతెన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ఆయా చోట్ల నిత్యమూ ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ కొత్తరోడ్డు సమీపంలో ఉన్న వంతెన వద్ద ఇరువైపులా భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. దీ నితో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర అత్యవసర వాహన దారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రహదారి అభివృద్ధి పరిచినా ఫలితం ఏమిటని వారంతా ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వేసవి కాలంలో కల్వర్టులు వంతెన నిర్మాణాలు పూర్తి చేయా ల్సిన రోడ్లు భవనాలశాఖ అధికారులు పూర్తిస్థాయి ఇర్లక్ష్యం వహించడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆవే దన చెందుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సా యంత్రం వేళల్లో శ్రీకాకుళం- ఆమదాలవలస మధ్య ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో ఆయా చోట్ల ట్రా ఫిక్‌ను క్రమద్దీకరించేందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని పోలీసులను స్థాని కులు కోరుతు న్నారు. తద్వారా అయినా ఈ సమస్యకు కాస్త పరిష్కారం దొరుకుందంటు న్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:53 PM