శభాష్ మేజర్
ABN, Publish Date - May 24 , 2025 | 12:11 AM
Indian Army Bravery కీర్తిచక్ర అవార్డు గ్రహీత మేజర్ మళ్ల రామ్‌గోపాలనాయుడుకి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం అభినందనలు తెలిపారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన రామ్‌గోపాలనాయుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి కీర్తిచక్ర అవార్డు పొందడం జిల్లాకే తలమానికమని పేర్కొన్నారు.
రామ్‌గోపాలనాయుడుకు కేంద్రమంత్రి అభినందనలు
సంతబొమ్మాళి/అరసవల్లి/ టెక్కలి, మే 23(ఆంధ్రజ్యోతి): కీర్తిచక్ర అవార్డు గ్రహీత మేజర్ మళ్ల రామ్‌గోపాలనాయుడుకి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం అభినందనలు తెలిపారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన రామ్‌గోపాలనాయుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి కీర్తిచక్ర అవార్డు పొందడం జిల్లాకే తలమానికమని పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదుల్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన రాంగోపాల్‌నాయుడు దేశం గర్వించదగ్గ సైనికుడని కొనియాడారు. దేశ రక్షణ వ్యవస్థలో రెండవ అత్యున్నతమైన కీర్తిచక్ర అవార్డుకు ఎంపికైన తొలి తెలుగువాడిగా చరిత్రలో నిలిచారని తెలిపారు. ఆయన పోరాట పటిమ, దేశభక్తి.. యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా మేజర్ రామ్‌గోపాలనాయుడుకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ బాధ్యతల్లో ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొని పోరాడిన రాంగోపాల్‌నాయుడుకు కీర్తిచక్ర అవార్డు దక్కడం అభినందనీయమన్నారు.
Updated Date - May 24 , 2025 | 12:11 AM