సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:52 PM
ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే నాలుగు సంవత్సరాల్లో చేపట్టనున్న విఽధానాలను ప్రజలకు ముందుకు వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణ తరగతులను నరసన్నపేట, పోలాకి మండలాల నాయకులకు నిర్వహించారు.
నరసన్నపేట, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే నాలుగు సంవత్సరాల్లో చేపట్టనున్న విఽధానాలను ప్రజలకు ముందుకు వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు శిక్షణ తరగతులను నరసన్నపేట, పోలాకి మండలాల నాయకులకు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, శిమ్మ చంద్రశేఖర్, జల్లు చంద్రమౌళి, గొద్దు చిట్టిబాబు, కింజరాపు రామారావు, ఉణ్న వెంకటేశ్వరరావు, జామి వెంకట్రావు, గొలివి రామారావు, నాయకులు ఎంవీ నాయుడు, కె.రమేష్, బైరి భాస్కరరావు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:52 PM