ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెంటు భూమి ఉన్నా ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తాం

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:06 AM

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న దాత సుఖీభవ పథకాన్ని సెంటు భూమి ఉన్న ప్రతి రైతుకు అందిస్తామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌
  • పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

సరుబుజ్జిలి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న దాత సుఖీభవ పథకాన్ని సెంటు భూమి ఉన్న ప్రతి రైతుకు అందిస్తామని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం రొట్టవలస గ్రామ సచివాలయ పరిధిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు గ ణాంకాలతో సంక్షేమ పథకాలు అందించేదని, దానికి భిన్నంగా నేటికీ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు రెట్టింపు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయడంపై చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ దృష్టిసారించారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, ఎంపీడీవో పావని, వ్యవసాయాధి కారి బి.పద్మనాభం, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ నాయకులు తాడేల వెంకటరమణ, తాడేల రాజారావు, కిల్లి సిద్దార్థ, తర్లాడ సురేంద్ర, నందివాడ గోవిందరావు, అంబళ్ల రాంబాబు, నూక ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఇదిలావుంటే డీసీసీబీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతు చేపట్టిన శివ్వాల సూర్యనారాయణను రొట్టవలస గ్రామా నికి చెందిన టీడీపీ నాయకులు తాడేల వెంకటరమణ, తాడేల రాజారావు, తాడేల గోవిందరావు, బెవర రాజారావు, గ్రామస్థులు గజమాలతో సత్కరించారు.

వైసీపీ కనుమరుగు ఖాయం: రవికుమార్‌

ఆమదాలవలస, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకుంటున్న వైసీపీ నేతలకు ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని, తద్వారా ఆ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు అవ్వడం ఖాయమని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పూర్తిస్థాయి పీకల్లోతు అప్పుల్లో ముంచి ప్రజలకు అరకొర సంక్షేమ పథకాలు అందించి వైసీపీ అవినీతి నేరస్థులు ప్రజాధనాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. ఎంతో ముందుచూపుతో పరిపాలన చేస్తున్న విజన్‌ ఉన్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, ఆ స్థాయిని మరిచి వైసీపీ సైకోలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల మాజీ మంత్రి బొత్స కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికివంద నం పథకంపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో మర ణించినవారి ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. మృతుల కుటుంబా లను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొదలవలస రమేష్‌, అన్నెపు భాస్కరరావు, కూన ఆం జనేయులు, కోరుకొండ రమణమూర్తి, కూన రమేష్‌, నాగళ్ల ముర ళీధర్‌ యాదవ్‌, ఎండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:06 AM