సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:44 PM
మునిసిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఆ సంఘ గౌరవాధ్యక్షుడు పి.తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శ్రీకాకుళం అర్బన్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఆ సంఘ గౌరవాధ్యక్షుడు పి.తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం నగర పాలకసంస్థ కార్యాలయం వద్ద ఆ సంఘ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలన్నారు. జనాభా కు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం 36 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం ప్రకటించి ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్య క్రమంలో కార్మికుల సంఘ నాయకులు జె.గురుమూర్తి, పార్థసారథి, శ్రీను పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:44 PM