శివారు భూములకు సాగునీరందిస్తాం
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:42 PM
వంశధార కాలువలు శివారు వ్యవసాయ భూములకు సాగునీరందించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జలుమూరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): వంశధార కాలువలు శివారు వ్యవసాయ భూములకు సాగునీరందించడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పెద్దదుగాం వద్ద వంశధార ప్రధాన ఎడమకాలువపై గల నరసన్నపేట బ్రాంచి కాలువకు ఆదివారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 24 ఎన్‌బీసీ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కాలువ ద్వారా నరసన్నపేట, పోలాకి మండలాల పరిధిలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వంశధార ఈఈ మురళీమోహన్, డీఈలు శిమ్మ శ్రీనివాసరావు, రామలక్ష్మి, ఏఈలు హరీష్, శ్యామలరావు, పర్లాం, నరసన్నపేట, పోలాకి, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు కింజరాపు సత్యం, శిమ్మ చంద్రశేఖరరావు, ఎం.వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:42 PM