ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘వంశధార’తో నీటి సమస్య పరిష్కరించాం

ABN, Publish Date - May 06 , 2025 | 12:09 AM

ఉద్దానం ప్రాజెక్ట్‌ ద్వారా బాహుదాకు వంశధార నీరందించి మునిసిపాలిటీలో నీటి కొరత సమస్య పరిష్కరించామని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు.

వాల్‌ ఓపెన్‌చేసి వంశధార జలాలు ప్రారంభిస్తున్న అశోక్‌:

ఇచ్ఛాపురం, మే 5(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాజెక్ట్‌ ద్వారా బాహుదాకు వంశధార నీరందించి మునిసిపాలిటీలో నీటి కొరత సమస్య పరిష్కరించామని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. సోమవారం ఇచ్ఛాపురంలోని సంతపేట పంప్‌ పంప్‌హౌస్‌ వద్ద ఉద్దానం ప్రాజెక్ట్‌కు చేరిన వంశధార జలాలను వాల్‌ ఓపెన్‌ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐఐబీ ప్రాజెక్ట్‌కు రూ.62కోట్లు మంజూరుకావడంతో త్వరలో పనులు ప్రారంభించి మునిసిపాలిటీలోని 23వార్డులకు ఇంటింటా కుళాయిల ద్వారా తాగునీరందిస్తామని తెలిపారు. కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, ఈఈ సుగణకారరావు, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ యాదవ్‌, పట్టణ కార్యదర్శి నందికి జాని, కౌన్సిలర్లు కాళ్ల దిలీప్‌, పత్రి తవిటయ్య, ఆశీ లీలారాణి, నాయకులు శేఖర్‌, కృష్ణయ్య, కొరాయి ధర్మరాజు, రెయ్యి, జానకిరావు, జన్నెల సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:09 AM