రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:53 PM
: సహకార సంఘాలను లాభాల బాటలో నడిపించి రైతులు అభ్యున్నతికి కృషిచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.
జలుమూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలను లాభాల బాటలో నడిపించి రైతులు అభ్యున్నతికి కృషిచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. గురువారం అల్లాడ సొసైటీ కార్యాలయం ఆవరణలో సొసైటీ చైర్మన్‌గా వెలమల చంద్రభూషణరావు, సభ్యులుగా కొబగాపు వెంకటరావు, సనపల రామ్‌జీ ప్రమాణ స్వీకారంచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, డీసీసీబీచైర్మన్ శివ్వాల సూర్యం, టీడీపీ మండలాధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ, కన్వీనరు బగ్గు గోవిందరావు, జడ్పీ టీసీ మెండ విజయశాంతి, ఏఎంసీ చైర్మన్ తర్ర బలరాం, చల్లవానిపేట, నరసన్నపేట సొసైటీ అధ్యక్షులు దుంగ స్వామిబాబు, అప్పారావు, నాయకులు సత్యం, అడపా చంద్రశేఖర్, హనుమంతు రంగనాధం, పంచిరెడ్డి రామచంద్రరావు, చల్లవానిపేట డీసీసీబి మేనేజరు వెంకటరమణ, అల్లాడ సీఈవో గిరిధర్ పాల్గొన్నారు.
:
Updated Date - Jul 31 , 2025 | 11:53 PM