right path సన్మార్గంలో పయనించాలి
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:04 AM
right path సృష్టిలో అవతారాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కరేనని ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ సన్మా ర్గంలో పయనించేందుకు భక్తిభావం పెంపొం దించు కోవాలని ఆధ్యాత్మి కవేత్త, వాగ్దేవీ వర పుత్ర సామవేదం షన్ముఖ శర్మ అన్నారు.
ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ
కొత్తూరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): సృష్టిలో అవతారాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కరేనని ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ సన్మా ర్గంలో పయనించేందుకు భక్తిభావం పెంపొం దించు కోవాలని ఆధ్యాత్మి కవేత్త, వాగ్దేవీ వర పుత్ర సామవేదం షన్ముఖ శర్మ అన్నారు. కొత్తూరు వేంక టేశ్వర ఆలయంలో బుధ వారం ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ తనకు తాను ఆనందంగా ఉండి ఇత రులను ఆనందంగా ఉండేలా చూసుకోవా లన్నారు. భక్తిని పెంపొందించు కోవడం ద్వారా ముక్తిమార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో టీటీడీ ప్రచార కులు పొగిరి రవి, ఎల్.తులసీ వరప్రసా దరావు, ఎల్.లక్ష్మీ నారాయణనాయుడు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 12:04 AM