High court judge: పర్యావరణాన్ని పరిరక్షించాలి
ABN, Publish Date - May 11 , 2025 | 11:27 PM
Environmental Protection పర్యావరణాన్ని అందరూ పరిరక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పోర్టుఫోలియా న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయాధికారి జునైద్‌అహ్మద్ మౌలానాతో కలిసి ఆయన మొక్కలునాటారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి
శ్రీకాకుళం లీగల్, మే 11(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని అందరూ పరిరక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పోర్టుఫోలియా న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయాధికారి జునైద్‌అహ్మద్ మౌలానాతో కలిసి ఆయన మొక్కలునాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పర్యావరణ సమతుల్యతకు మొక్కలు దోహదపడతాయి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’ అని తెలిపారు. మొక్కలను సీనియర్ న్యాయవాది సుభాష్ అందజేశారు. కార్యక్రమంలో న్యాయాధికారులు పి.భాస్కరరావు, వివేకానంద శ్రీనివాస్, ఫణికుమార్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధానకార్యదర్శి పిట్టా దామోదర్, ఉపాధ్యక్షుడు సీతరాజు, మహిళా ప్రతినిధి గురుగుబెల్లి వనజాక్షి, సీనియర్ న్యాయవాదులు మెట్ట సత్యనారాయణ, భైరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:27 PM