Dolotsavam వైభవంగా వల్లభనారాయణ డోలోత్సవాలు
ABN, Publish Date - Mar 11 , 2025 | 11:56 PM
Dolotsavam రట్టి వల్లభనారాయణ స్వామి డోలోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునుంచే ప్రధాన అర్చకులు రట్టి సీతారాం, నీలకంఠం, ప్రహ్లాదులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు. పూజలు నిర్వహించారు.
హరిపురం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రట్టి వల్లభనారాయణ స్వామి డోలోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునుంచే ప్రధాన అర్చకులు రట్టి సీతారాం, నీలకంఠం, ప్రహ్లాదులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు. పూజలు నిర్వహించారు. ఆలయం భక్తు లతో కళకళలాడింది. స్వామి తిరువీధి ఉత్సవం కనులపండువగా నిర్వహించారు. అధిక సంఖ్య లో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శిం చుకుని ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు.
నేటినుంచి వెంకటేశ్వర స్వామి డోలోత్సవం
హిరమండలం, మార్చి 11 (ఆంధ్ర జ్యోతి): హిరమండలం సుభలయ మెట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి డోలోత్సవాలను బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చివరి రోజు శుక్రవారం వంశ ధార నదిలో చక్రతీర్థ స్నాన మహో త్సవం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదా లను స్వీకరించి తరించాలని వారు ఒక ప్రకటనలో కోరారు.
Updated Date - Mar 11 , 2025 | 11:56 PM