భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - May 14 , 2025 | 11:56 PM
భూ సమస్యలపై తహసీల్దార్లు తక్ష ణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
-సీఆర్‌జెడ్‌పై అవగాహన కలిగి ఉండాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 14 (ఆంధ్ర జ్యోతి): భూ సమస్యలపై తహసీల్దార్లు తక్ష ణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో భూ సమస్య లు, ఎలివేషన్స్, మ్యుటేషన్లపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సమస్యలపై దృష్టి సారించి అన్నిం టినీ పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, సీడీపీవో కార్యాలయాలకు తహ సీల్దార్లు భూములను గుర్తించి, సంబంధిత ఆర్డీవో ద్వారా ప్రతిపాదనలను తనకు పం పాలని స్పష్టం చేశారు. ‘జిల్లా అధికారులు కూడా అవసరమైన రెవెన్యూ భూములపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. జడ్పీ, ఐసీడీఎస్, పర్యా టకం, డీఆర్డీఏ, పరిశ్రమలు, రహదారులు భవనాలు, వంశధార, పోస్టల్, ఉద్యానవన, ఆర్‌డబ్ల్యూఎస్, మత్స్య, వైద్యఆరోగ్య తదితర శాఖలకు సంబంధించిన అధికారులు ఆయా మండలాల్లో ఉన్న భూ సమస్యలను సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుని ప్రతిపాదనలు పంపాలి. శ్రీకాకుళానికి అందుబాటులో ఉన్న మండ లాల్లో భూ కేటాయింపులు చేసి, ఉపయో గంలో లేని భూములను గుర్తించాలి. తీర ప్రాంత తహసీల్దార్లు సీఆర్‌జెడ్ నిబంధ నలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఏ ప్రాంతం వరకు శాశ్వత నిర్మా ణాలు ఉండాలి.. తాత్కాలిక నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలి వంటి అంశాలపై స్పష్టత ఉండాలి. అటవీ చట్టాలపై అవగాహన ఉండాలి.’ అని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీవోలు కె.సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 11:56 PM