ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టణాభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష

ABN, Publish Date - May 08 , 2025 | 12:02 AM

పట్టణ అభివృద్ధే ధ్యేయమని, అన్ని వార్డుల్లో పనులు చేపడతామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

పలాస: సీసీ రోడ్డు పనుల శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, మే 7(ఆంధ్రజ్యోతి): పట్టణ అభివృద్ధే ధ్యేయమని, అన్ని వార్డుల్లో పనులు చేపడతామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. 18వ వార్డు ఐటీఐ మార్గంలో రూ.7.30 లక్షల తో సీసీ రోడ్డు, 4వ వార్డు మీలగారంపాడులో రూ.5 లక్షలతో కంకర రోడ్డు పనులకు బుధ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మునిసిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. అన్ని వార్డుల్లో రోడ్లు, కాలువల నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్‌ సౌక ర్యం కల్పిం చడం జరిగిందన్నారు. శివారు ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ ఎన్‌.రామారావు, టీడీపీ నాయ కులు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గురి టి సూర్యనారాయణ, ఎం.నరేంద్ర, మల్లా శ్రీనివాస్‌, ఎ.రామకృష్ణ, సత్యం, దడియాల నర్సింహులు పాల్గొన్నారు.

మా గ్రామాన్ని వజ్రపుకొత్తూరులో విలీనం చేయండి

సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామాన్ని జనాభా చాలలేదని పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో కలిపా రని, కనీస సదుపాయాలు లేకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నామని, మా గ్రామాన్ని వజ్రపుకొత్తూరు మండలంలో విలీనం చేయా లని మీలగారంపాడు గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే శిరీషను కలిసి తమ గోడును వెలిబుచ్చారు. పల్లిసారధి, రాజాం పంచాయతీలకు సమీపంలో మా గ్రామం ఉందని, మునిసిపాలిటీకి సంబంధం లేకున్నా కేవలం జనాభా కోసం పట్టణంలో విలీనం చేశారని, న్యాయం చేయాలని కోరారు.

ఆర్థిక స్వావలంబన సాధించాలి

పలాస రూరల్‌, మే 7(ఆంధ్రజ్యోతి): మహి ళలు ఆర్థిక స్వావలంబన సాధించి స్వయం ఉపాధి పొందాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వెలుగు కార్యాలయంలో బీసీ కార్పొ రేషన్‌ ఆధ్వర్యంలో మహిళలకు అందించను న్న కుట్టు శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వసంత్‌కుమార్‌, టీడీపీ నేతలు పీరికట్ల విఠ ల్‌, కుత్తుమ లక్ష్మణ్‌కుమార్‌, దువ్వాడ సంతో ష్‌, వెలుగు అధికారులు, మహిళలు పాల్గొ న్నారు.

రుణపడి ఉంటాం: పూడిలంక వాసులు

వజ్రపుకొత్తూరు, మే 7(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని, పూడిలంక రోడ్డు నిర్మాణా నికి రూ.4 కోట్లు మంజూరు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేర కు బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేసిన కృషికి రుణపడి ఉం టామంటూ ఆనందభాష్పాలు రాల్చారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఆదుకోవా లని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి గ్రామ మహిళలు మిఠాయిలు తినిపించి తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.

Updated Date - May 08 , 2025 | 12:02 AM