Inspection of cinemas: అపరిశుభ్రంగా మరుగుదొడ్లు
ABN, Publish Date - May 29 , 2025 | 11:44 PM
Inspection of cinemas: రాష్ట్ర టూరిజం మంత్రి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలోని అన్ని సినిమా థియేటర్లను గురు వారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు.
- లైసెన్స్ రెన్యువల్ కూడా చేయలే
- సినిమా థియేటర్ల తనిఖీలో గుర్తించిన అధికారులు
శ్రీకాకుళం/క్రైం, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర టూరిజం మంత్రి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలోని అన్ని సినిమా థియేటర్లను గురు వారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. పరిషత్ సమీపంలోని కిన్నెర, కీర్తన, కీర్తిక, ఎన్జీవో భవనం పక్కన ఉన్న మారుతి, రామ లక్ష్మణ్ జంక్షన్‌లోని ఎస్‌వీసీ, సరస్వతి తదితర థియేటర్లను తనిఖీ చేశారు. పార్కింగ్, టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరలు, అగ్నిమాపక పరికరాలు, పరిశుభ్రత, అన్ని విధాలా లైసె న్స్‌లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. మారుతీ థియేటర్‌లో వైద్యఆరోగ్యశాఖ మంజూ రు చేసే ధ్రువపత్రం లేదని తనిఖీలో బయట పడింది. దీంతోపాటు ఫైర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే లైసెన్స్‌ను కూడా రెన్యువల్ చేయలేదని గుర్తించారు. దీనిపై థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీచేయనున్నారు. ఎస్‌వీసీ థియే టర్‌లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, అక్కడక్కడా టైల్స్ పాడైనట్లు గుర్తించారు. సూర్యమహల్‌లో పలు లోపాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో శ్రీకాకుళం తహసీల్దార్ గణపతి రావు, సూపరింటెండెంట్ పొదిలాపు శ్రీనివాస రావు, రెవెన్యూఅధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:44 PM