ఐఎస్‌వో గుర్తింపుతో వర్సిటీలకు ప్రయోజనం
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:42 PM
ఐఎస్‌వో గుర్తింపుతో యూనివర్సిటీలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన జీసీ కన్సల్టెన్సీ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ వికాశ్ శ్రీవాత్సవ్ అన్నారు.
ఎచ్చెర్ల, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఐఎస్‌వో గుర్తింపుతో యూనివర్సిటీలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన జీసీ కన్సల్టెన్సీ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ వికాశ్ శ్రీవాత్సవ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీలో ఐఎస్‌వో గుర్తింపు, గ్రీన్ ఆడిట్ కోసం మంగళవారం వర్సిటీ అధికారులు, అధ్యాప కులు, విద్యార్థులతో మాట్లాడారు. వర్సిటీకి జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపుతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు, ప్రాజెక్ట్‌లు పొందేందుకు ఐఎస్‌వో గుర్తింపు అవసరమన్నారు. 14 వివిధ అంశాలను పరిగణనలోని తీసు కుని ఐఎస్‌వో గుర్తింపు ఇస్తారన్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని మా ట్లాడుతూ.. వినూత్న విధానాలు పాటిస్తే వర్సిటీ మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా సమన్వయంతో పనిచేయాల న్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎస్.ఉదయ భాస్కర్, డాక్టర్ ఎం.అనూరాధ, డాక్టర్ సీహెచ్ రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 11:42 PM