రోడ్ల మరమ్మతులు చేపట్టండి
ABN, Publish Date - May 06 , 2025 | 12:15 AM
పంచాయతీరాజ్ పరిధిలో రూ.6.13 కోట్లతో లక్షలతో ఆరు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆ శాఖ ఈఈ రామకృష్ణ, డీఈఈ పొన్నాడ సుధాకర్, అల్లు చంద్రినాయుడులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశిం చారు.
తాగునీటికి ఇబ్బందులు రాకూడదు
వివిధ శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు
టెక్కలి, మే 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ పరిధిలో రూ.6.13 కోట్లతో లక్షలతో ఆరు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆ శాఖ ఈఈ రామకృష్ణ, డీఈఈ పొన్నాడ సుధాకర్, అల్లు చంద్రినాయుడులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశిం చారు. సోమవారం రాత్రి నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాబార్డు నిధులు రూ.1.69 కోట్లతో కురుడు-దంత-చిన్నసాన, రూ. 57.58 లక్షలతో హైవే నుంచి కన్నేవలస-నారాయణపురం, సంతబొమ్మాళి మండ లంలో రూ.1.41 కోట్లతో బోరుభద్ర నుంచి కొల్లిపాడు వరకు రోడ్డు పనులు చేపట్టా లన్నారు. అలాగే రూ.54.84 లక్షలతో హైవే కోటబొమ్మాళి నుంచి సంత బొమ్మాళి కాపుగోదాయవలస వరకు, రూ.87.53 లక్షలతో డీపీఎం రోడ్డు టు ఉద్దండ పాలెం, రూ.1.01 కోట్లతో డీపీఎన్ రోడ్డు నుంచి గంగరాం పనులు చేపట్టాలని సూచించారు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి పరిధిలో రూ.17.50 లక్షలతో ఇరుకు వంతెనలు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. టెక్కలి-తెంబూరు రోడ్డు, సంతబొమ్మాళి, పాకివలస సమీపంలోని ఇరుకురోడ్లు బాగుచేయాలన్నారు. టెక్కలి-చెట్లతాండ్ర, టెక్కలి-రావివలస, తామరాపల్లి-దిమ్మిడిజోల రోడ్లు విస్తరణ చేయించాలని ఆర్‌అండ్ బీ డీఈఈలు రవికాంత్, తిరుపతిరావు, ఏఈలు జగదీష్, హరనాథ్‌లకు సూచిం చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రక్షిత నీటి పథకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ రామకృష్ణకు ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి పలు వినతులన స్వీకరించారు.
Updated Date - May 06 , 2025 | 12:15 AM