ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణ

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:16 AM

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

నరసన్నపేట శివారులో జాతీయరహదారి పక్కనే వేసిన అక్రమ లేఅవుట్‌

- అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

నరసన్నపేట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ జీవో నెం.134ను ఇటీవల విడుదల చేశారు. 2019 ఆగస్టుకు ముందు ప్లాట్లు, వెంచర్లు వేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజ్డ్‌ స్కీం) ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే వాటిని రెగ్యులరైజ్డ్‌ చేస్తూ వచ్చారు. తాజాగా, ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీలోపు అనధికార లేఅవుట్లకు మార్కెట్‌ విలువలో 7శాతం ప్రభుత్వానికి చెల్లిస్తే అధికారులు వాటిని క్రమబద్ధీకరణ చేయనున్నారు. జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పలాస, టెక్కలి, గార , కోటబొమ్మాళి, సంతబొమ్మాళి తదితర మండలాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. సుడా అనుమతులు లేకుండా వెంచర్లు వేసిన 165 మందికి గతేడాది నోటీసులు జారీ చేశారు. అనాధికారంగా వేసిన లేఅవుట్‌లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ అవకాశం పొందిన స్థలదారులు భవన నిర్మాణ అనుమతుల సమయంలో బెటర్‌మెంట్‌, ఓపెన్‌ స్పేస్‌ కింద 14శాతం చెల్లించాల్సిన అవసరం ఉండదని ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Aug 01 , 2025 | 12:16 AM