ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉమా చంద్రమౌళీశ్వరుని ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - May 26 , 2025 | 11:42 PM

పూశాం గ్రామంలో ఉమా చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహ, లింగ ప్రతిష్ఠోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఎల్‌ఎన్‌పేట: సామూహిక కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు

ఎల్‌.ఎన్‌.పేట, మే 26(ఆంధ్రజ్యోతి): పూశాం గ్రామంలో ఉమా చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహ, లింగ ప్రతిష్ఠోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలను వేదపండితుడు సర్వాజ్యోస్యుల లక్ష్మీవెంకటగౌరీ వరప్రసాద్‌శర్మ ఆధ్వ ర్యంలో పురోహి తుడు నేతేటి వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో రుత్వి కులు చేపట్టారు. మహిళలు కలశాలతో ఆలయానికి చేరుకుని స్వామికి అభిషేకించారు. కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వా హకులు తెలిపారు. పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ముగిసిన ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం

పోలాకి, మే 26(ఆంధ్రజ్యోతి): గంటపేటలో ఈనెల 22 నుంచి ప్రారంభమైన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ 27 వార్షికోత్సవం సోమవారంతో ముగి సింది. స్వామి వారి తిరువీధి, కోలాట నృత్య ప్రదర్శన, గీతాపారాయణ, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేపట్టారు. సాయం త్రం జిల్లాస్థాయి 150 కేజీల ఉలవల బస్తాల పోటీ నిర్వహించారు. ఒప్పంగికి చెందిన గేదెల సత్యనారాయణ, చింతువానిపేటకు చెందిన ఆవల వసంతరావు, ఎ.త్రినాథరావు మొదటి మూడు బహుమతులను వరుస గా సాధించారు. వీరికి నిర్వాహకులు, ఽధర్మకర్త తార రాజారావు తదితరు లు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

గ్రామదేవతకు ముర్రాటల సమర్పణ

మందస, మే 26(ఆంధ్రజ్యోతి): మందస గ్రామదేవత అన్నపూర్ణమ్మ ఆలయ 15వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రధా న అర్చకులు గోవింద దుధిష్టి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పూజలు చేపట్టారు. దేవర వీధి నుంచి మార్కెట్‌ రోడ్డు, మెయిన్‌రోడ్డు, శాసనం రోడ్డు మీదుగా కలశాలతో మహిళలు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

Updated Date - May 26 , 2025 | 11:42 PM