ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన విద్యార్థి మృతి

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:35 PM

మందస మండలం డబార్సింగి రిజర్వాయర్‌లో ప్రమాదవ శాత్తు జారిపడి బొగాబంద పంచాయతీ కొంటా సాయి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర మంజు (16) మృతి చెందాడు.

డబార్సింగి రిజర్వాయర్‌లో జారిపడి..

ఇటీవల ఇంటర్‌లో చేరిన సవర మంజు

హరిపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మందస మండలం డబార్సింగి రిజర్వాయర్‌లో ప్రమాదవ శాత్తు జారిపడి బొగాబంద పంచాయతీ కొంటా సాయి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర మంజు (16) మృతి చెందాడు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంజు పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇటీవల ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరాడు. శనివారం సాయంత్రం పశు వులను మేపేందుకు తీసుకువెళ్లాడు. పశువులు ఇంటికి వచ్చినా మంజు సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోయేసరికి గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురై బంధువులు, సమీప గ్రామాల్లో ఆరా తీశారు. ఆదివారం ఉదయం రిజర్వాయర్‌లో మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మంజుకు ఈత రాకపోవడంతో రిజ ర్వాయర్‌ గట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెంది నట్లు అనుమానిస్తున్నారు. సుబ్బారావు, రొయబారిల ఏకైక కుమారుడు మంజు. కాయకష్టం చేసుకుని ఉన్నత చదువులు చదివించాలని భావిం చారు. అయితే ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో వారి రోదనలు మిన్నంటాయి. మంజు మృతితో ఆ ప్రాంత గిరిజన గూడేల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరి పురం ఆసుపత్రికి తరలించగా మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:35 PM