ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జూనియర్‌ కళాశాలల్లో బదిలీలు

ABN, Publish Date - May 24 , 2025 | 12:06 AM

unior Colleges Lecturer Transfers ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బోధన, బోధనేతన సిబ్బంది బదిలీల షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం విడుదల చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8వరకు బదిలీలను నిర్వహించనున్నారు.

జిల్లాలో సుమారు 200 మందికి స్థానచలనం

ప్రిన్సిపాల్స్‌కు, జేఎల్స్‌కు పనితీరు ఆధారంగా పాయింట్లు

నరసన్నపేట, మే 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బోధన, బోధనేతన సిబ్బంది బదిలీల షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం విడుదల చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8వరకు బదిలీలను నిర్వహించనున్నారు. ఈ సారి కొత్తగా ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్టరర్స్‌కు పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం కాలేజీలో ఐదేళ్లు దాటిన ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్టరర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. రెండేళ్లు సర్వీసు దాటిన వారు కావాలంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 16శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న కేటగిరి-ఏ ఉంటే ఏడాదికి 2 పాయింట్లు, 12శాతం హెచ్‌ఆర్‌ఏ పనిచేస్తున్న వారికి ఏడాదికి 4 పాయింట్లు, 10శాతం హెచ్‌ఆర్‌ఏ పరిఽధిలో పనిచేసే జేఎల్స్‌కు ఏడాదికి -6 పాయింట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి ఏడాదికి 8 పాయింట్లు ఇస్తారు. పనితీరు ఆధారంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చారు. జేఎల్స్‌కు ఆయా సబ్జెక్టులో ఇంటర్‌ ఫలితాల్లో 40శాతం ఉత్తీర్ణులైతే ఎటువంటి పాయింట్లు ఇవ్వరు. 41-60శాతం వరకు పాస్‌ అయితే రెండు పాయింట్లు, 61-80శాతం వరకు 4 పాయింట్లు, 81శాతం నుంచి 100 శాతం లోపు ఉంటే ఆరుపాయింట్లు ఇస్తారు. కళాశాల ఉత్తీర్ణత ఆధారంగా ప్రిన్సిపాల్స్‌కు పాయింట్లు కేటాయిస్తారు. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, కెజీబీవీ కళాశాలలు -25, మోడల్‌ పాఠశాలల్లో నడుస్తున్న కళాశాలలు -13 ఉన్నాయి. వీటిలో జూనియర్‌ లెక్చర్స్‌ర్‌ సుమారు 400 మందికిపైగా పనిచేస్తున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి అయిన వారు తప్పనిసరిగా బదిలీ కావడంతో సుమారు 200 మంది లెక్చరర్స్‌, ప్రిన్సిపాల్స్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రెగ్యులర్‌ సిబ్బంది బదిలీల తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న లెక్చరర్స్‌కు ఖాళీలు ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.

Updated Date - May 24 , 2025 | 12:06 AM