ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగం కోసం శిక్షణ పొందుతూ..

ABN, Publish Date - May 23 , 2025 | 12:26 AM

ఆ యువకుడు ఉద్యోగం కోసం నంద్యాలలో శిక్షణ పొందుతూ వారం రోజుల కిందట స్వగ్రామం చొర్లంగి గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్‌ లోని అక్క, బావలను చూసేందుకు వెళుతూ రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయనగరం జిల్లాలో రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

చొర్లంగిలో విషాద ఛాయలు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఎల్‌.ఎన్‌.పేట, మే 22(ఆంధ్రజ్యోతి): ఆ యువకుడు ఉద్యోగం కోసం నంద్యాలలో శిక్షణ పొందుతూ వారం రోజుల కిందట స్వగ్రామం చొర్లంగి గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్‌ లోని అక్క, బావలను చూసేందుకు వెళుతూ రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. మండల పరిధి చొర్లంగి గ్రామానికి చెందిన అగతముడి వెంకటేష్‌ (23) హైదరాబాద్‌ వెళ్లేం దుకు ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్‌) రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫలక్‌ నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. విజయనగరం జిల్లా కొత్త వలస సమీపంలోని అంటకాపల్లి వద్ద రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అయితే రాత్రి సమయం కావడంతో బుధవారం ఉదయం అక్క డి రైల్వే పోలీసులు గుర్తించి మృతుడి వివరాల కోసం ఆరా తీసినా లభించలేదు. చివరకి మృతుడి వద్ద లభించిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా ఆయన కుటుంబ సభ్యులకు బుధవారం సాయంత్రం సమాచారం ఇచ్చా రు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి గురువారం అప్పగించారు. అక్కడి నుంచి మృతదేహం గురువారం సాయంకాలానికి స్వగ్రామం చొర్లంగికి తీసుకురాగా యువకులు రావి చెంద్రి గ్రామం వద్ద నుంచి స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన వెంకటేష్‌ వారం రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చి అక్క, బావలను చూసేందుకు వెళుతూ మృతి చెందడంతో గ్రామం లో విషాదఛాయలు నెలకొన్నాయి.

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఆమదాలవలస, మే 22(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాల వలస) రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం రైలు ఢీకొని బి.మల్లేష్‌ (79) మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి.. తండ్యాంవలసకి చెందిన మల్లేష్‌ బమ్మిడివానిపేట రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 12:26 AM