Tragedy: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:07 AM
Student dies after going to river స్నేహితుల దినోత్సవం రోజున తోటి స్నేహితులతో సరదాగా ఈతకు ఓ విద్యార్థి వెళ్లి మృత్యువాతపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
స్నానం కోసం నదికి వెళ్లి విద్యార్థి మృతి
లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు
బూర్జ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): స్నేహితుల దినోత్సవం రోజున తోటి స్నేహితులతో సరదాగా ఈతకు ఓ విద్యార్థి వెళ్లి మృత్యువాతపడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. పార్వతీపురం మన్యం జిల్లా పాల కొండ నగరపంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాసుబిల్లి దుర్గా ప్రసాద్(19) మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ఆదివారం బూర్జ మండలం లాభాం సమీ పంలోని నాగావళి నదికి స్నానానికి వెళ్లాడు. ఈత రాక పోవడంతో నదిలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. మిగతా ఐదుగురు ఒడ్డుకు చేరుకుని గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామ యువకులతో కలిసి మళ్లీ నదికి వెళ్లి దుర్గాప్రసాద్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. బయ టకు తీసుకువచ్చి చూడగా అప్పటికే మృతి చెం దాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రవల్లిక సిబ్బం దితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలిం చారు. దుర్గాప్రసాద్‌కు తండ్రి రాము, తల్లి భారతి, చెల్లెలు ఉన్నారు. తమ కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. స్నేహితు లు విషాదంలో మునిగిపోయారు.
Updated Date - Aug 04 , 2025 | 12:07 AM