ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్తంభించిన ట్రాఫిక్‌!

ABN, Publish Date - May 15 , 2025 | 12:11 AM

జిల్లాలోని ప్రధాన ర హదారుల్లో ఒకటైన కళింగ పట్నం, శ్రీకాకుళం, పార్వతీ పురం (సీఎస్‌పీ) రహదా రి బుధవారం స్తంభించి పోయింది.

భారీగా నిలిచిన వాహనాలు
  • కొత్తరోడ్డు సమీపాన సీఎస్‌పీ రోడ్డులో నిలిచిన వాహనాలు

  • ఇబ్బందిపడిన వాహనచోదకులు

ఆమదాలవలస, మే 14(ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రధాన ర హదారుల్లో ఒకటైన కళింగ పట్నం, శ్రీకాకుళం, పార్వతీ పురం (సీఎస్‌పీ) రహదా రి బుధవారం స్తంభించి పోయింది. శ్రీకాకుళం నుం చి ఆమదాలవలస వరకు నాలుగు లైన్ల రోడ్డుగా ఇటీవ ల అభివృద్ధి చెందుతున్న ఈ రహదారి మధ్యలో కల్వర్టుల నిర్మాణం, కొన్ని గ్రామాల్లో జరుగుతున్న అమ్మవారి పండగలు కలిసి ఈ రహదారిలో భారీస్థాయిలో వాహనాలు నిలిచి పోయాయి. ముఖ్యంగా కొత్తరోడ్డు సమీపంలోని చర్చి వద్ద ఉన్న ప్రధాన కాలువ కల్వర్టు గత కొంతకాలం నుంచి మరమ్మతులకు నోచుకోకపోవడం, ఇటీవల జరి గిన ఈ రహదారి పనుల్లో దానిని పూ ర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టకపోవడం తో ప్రతిసారి ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించి భారీస్థాయిలో వాహనాలు నిలి చిపోతున్నాయి. ఇటీవల ఈ కల్వర్టు ప్రాం తంలో పక్క నుంచి వేరే మట్టి రహదారి ఏర్పా టు చేసి కల్వర్టు నిర్మాణం చేపట్టడానికి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే బుధవారం రాయి పాడు జంక్షన్‌ వద్ద ఉన్న కల్వర్టు ఒకవైపు తవ్వకాలు జరపడం, చర్చి వద్ద ఉన్న కల్వర్టు ప్రాంత పక్క రహదారిని మూసివేయడం వాహనాల రాకపోకలకు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే రహదారి సమీపంలో ఉన్న వంజంగి, గట్టుముడిపేట గ్రామాల్లో అమ్మవారి పండగలు నిర్వహించడంతో ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు రావడం కనిపించింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి కొత్తరోడ్డు ప్రాంతం నుంచి నందగిరిపేట వరకు ఈ సీఎస్‌పీ రహదారిలో భారీస్థాయిలో వాహనాలు స్తంభించిపోయాయి. మరో వైపు అంబులెన్స్‌ ఇరుక్కోవడంతో మరింత ఇబ్బంది ఎదురైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమదాలవల స, శ్రీకాకుళం పోలీసులు అక్కడికి చేరుకుని భారీ వాహనాలను కొత్త రోడ్డు నుంచి సింగుపురం.. చింతాడ మీదుగా మళ్లించారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, మరోవైపు ఎండ తీవ్రతకు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందిప డ్డారు. తిరిగి సాయంత్రం మళ్లీ ట్రాఫిక్‌ జామ్‌ కావడం తో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఓ వైపు వర్షం, మరో వైపు ట్రాఫిక్‌ సమస్యతో అవస్థలుపడ్డారు.

Updated Date - May 15 , 2025 | 12:11 AM