పొగాకు వినియోగాన్ని అరికట్టాలి
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:31 AM
గ్రామాల్లో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పిలుపునిచ్చారు.
- జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి అనిత
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 31(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆమె డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు జరిగింది. ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, పొగాకు నివారణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. పొగాకు వినియోగంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఉదరకోశ, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి గ్రామాల్లో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు అందరం కృషి చేయాలన్నారు. ఈ మేరకు 15 రోజుల కార్యాచరణను ప్రకటించారు. పొగాకు ఉత్పత్తుల చట్టం-2003ను కఠినంగా అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీకాంత్, వైద్యులు మేరీ క్యాథరీన్, ఇప్పిలి వెంకటరావు, డీఐవో రాందాస్, కార్యాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:31 AM