ఇది యువత పోరంట!
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:57 PM
Youth protest Student movement వైసీపీ యువజన విభాగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘యువత పోరు’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత కంటే వృద్ధులే ఎక్కువగా పాల్గొన్నారు.
వైసీపీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇక్కట్లు
శ్రీకాకుళం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ యువజన విభాగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘యువత పోరు’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత కంటే వృద్ధులే ఎక్కువగా పాల్గొన్నారు. ఇంతవరకు ఏ కార్యక్రమాల్లో కనిపించనివారు సైతం ప్రచార బోర్డులను పట్టుకుని నిరసన చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా... జిల్లాపరిషత్ కార్యాలయం గ్రీవెన్స్ వద్దకు ర్యాలీగా వచ్చిన వైసీపీ నాయకులు.. ఆ పార్టీ కార్యకర్తల తీరుతో ట్రాఫిక్ స్తంభించింది. సాధారణ జనం ఇక్కట్ల పాలయ్యారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద వైసీపీ నాయకుల ర్యాలీని సరిచేసి పంపించారు. వృద్ధులు.. నడివయస్కులు... అధికంగా పాల్గొని ర్యాలీ నిర్వహించడం.. వీళ్లు యువతగా పోరాడటం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:57 PM