ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:22 AM

ప్ర జల నుంచి అందే అర్జీలను సత్వరమే పరిష్క రించి.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

వృద్ధుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ
  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్ర జల నుంచి అందే అర్జీలను సత్వరమే పరిష్క రించి.. బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్య క్రమంలో ఎస్పీ 72 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరిం చి.. వారితో ముఖాముఖి మాట్లాడారు. ఫిర్యా దుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, అర్జీదారులతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదు దారుల అర్జీలు, వారి వివరాలను జూమ్‌ కాన్ఫరెన్స్‌లో తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చే యాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులకు అ త్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ని ర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కా రం చూపాలని సూచించారు. అర్జీలకు సంబం ధించి తీసుకున్న చర్యలను నిర్ణీత సమయం లో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూ పంలో పంపించాలని ఎస్పీ ఆదేశించారు. సో మవారం అందిన అర్జీలలో కుటుంబ సమస్య లు, భార్యాభర్తల గొడవలు, మోసపూరితమైన, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై ఉన్నాయి.

కానిస్టేబుల్‌ వేధిస్తున్నారు

పోలాకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ కాని స్టేబుల్‌ తనను వేధింపులకు గురి చేస్తున్నా రంటూ అదే మండలం జగన్నాథపురం గ్రా మానికి చెందిన మిరియాపల్లి కృష్ణ సోమవా రం గ్రీవెన్స్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫి ర్యాదు చేశారు. జగన్నాథపురంలో తన ఇంటి పక్కన ఉన్న స్థలం తోవను కానిస్టేబుల్‌ కబ్జా చేశారని ఆరోపించారు. దానిని అడ్డుకునేం దుకు ప్రయత్నించినందుకు కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నారని తెలిపారు. నరసన్న పేట సీఐ, పోలాకి ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినా కానిస్టేబుల్‌పై చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 12:24 AM