ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మద్యం దుకాణం ఇక్కడొద్దు

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:56 PM

మా కాలనీ వద్ద మద్యం దుకాణం వద్దని హౌసింగ్‌ కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్సైజ్‌ కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు.

ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న మహిళలు

హౌసింగ్‌ బోర్డు కాలనీ వాసుల నిరసన

ఎమ్మెల్యే, ఎక్సైజ్‌ అధికారులకు వినతులు

పాతపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మా కాలనీ వద్ద మద్యం దుకాణం వద్దని హౌసింగ్‌ కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్సైజ్‌ కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎక్సైజ్‌ అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లా డుతూ.. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం వల్ల మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం దుకాణం ఉన్న ప్రాంతంలోనే స్థానిక వసతి గృహ విద్యార్థులు ఆడుకుంటుంటారన్నారు. అలాగే వెలుగు కార్యాల యా నికి వచ్చే వారు ఈ ప్రదేశాన్ని బహిర్భూమిగా వినియోగిస్తున్నారన్నారు. ప్రధానంగా మద్యం మహిళలు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అభద్రత కలిగే అవకాశం ఉందన్నారు. తక్షణం దుకాణ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే గోవింద రావు స్పందిస్తూ.. మహిళా భద్రత ముఖ్యమని, వారి కి ఇబ్బంది కలిగే ఏ నిర్ణయాన్నైనా తాను వ్యతిరే కిస్తానన్నారు. వెంటనే ఎక్సైజ్‌ అధికా రులతో ఫోన్‌లో సంప్రదించి తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో రిటైర్డ్‌ ఎంపీడీవో సలాన చిరంజీవి, బీజేపీ నాయకుడు దుక్క శ్రీకాంత్‌, రేగేటి ఆనందరావు, కొంచాడ బాబూరావుతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:56 PM